వర్జీనియా ప్రవాసులతో జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సమావేశం

Featured Image

అమెరికా తెలుగు సంఘం ఆధర్యంలో వర్జీనియాలో జస్టిస్ జువ్వాడి శ్రీదేవి స్థానిక ప్రవాసులతో సమావేశమయ్యారు. శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు. చిన్న వయస్సులో వివాహం అయినప్పటికీ, తన విద్యను కొనసాగించి, పిల్లల ఆలనా-పాలనతో పాటు అనేక డిగ్రీలను పొందిన విధానాన్ని వివరించారు. కుటుంబ జీవితాన్ని న్యాయ వృత్తిని సమన్వయం చేస్తూ, ప్రైవేట్ ప్రాక్టీస్‌లోనూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేసి, చివరకు హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందినట్లు తెలిపారు.

భారత న్యాయ వ్యవస్థలో తన అనుభవాలను, ప్రవాస భారతీయులకు అవి ఎలా అనుసంధానం అవుతాయనేది ఆమె వివరించారు. కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించారు. న్యాయ ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ట్రస్టీ బోర్డు సభ్యులు విష్ణు మాధవరం, సుధీర్ బండారు, ఆటా 19వ కాన్ఫరెన్స్ నిర్వాహకులు రవి చల్లా, సుధీర్ డమీడి, జీనత్ కుండూర్, తిరుమల రెడ్డి, సభ్యులు, కేసీ జువ్వాడి, రాజ్ సబ్బాని, రమేష్ భీంరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ శ్రీదేవిని భారతదేశంలో డిసెంబర్ నెలలో జరిగే ఆటా వేడుకలతో పాటు, 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరిగే 19వ ఆటా కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి పూర్వం జస్టిస్ శ్రీదేవి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనాన్ని సందర్శించారు. అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని బిల్లుల ఆమొద ప్రక్రియను వీక్షించారు. అమెరికా 1810-1860 మధ్య అమెరికా సుప్రీం కోర్టుగా వినియోగించిన కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. న్యూజెర్సీ పర్యటనలో ప్రఖ్యాత అక్షరధాం ఆలయాన్ని కుటుంబసమేతంగా దర్శించారు.

Tags-AP High Court Justice Juvvadi Sridevi Tours Virginia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles