టొరంటో..డర్‌హమ్ తెలుగు క్లబ్ ఫ్యామిలీ ఫెస్ట్

Featured Image

డర్‌హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల, సంతోష్ కుంద్రు, ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి జ్యోతి ప్రజ్వలన చేశారు. కెనడా జాతీయ గీతం, మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది.

సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలు ప్రేక్షకులను అలరించాయి. డి.టి.సి కిడ్స్ ఫ్యాషన్ షో, కుకింగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు తూసి వినయగమూర్తి బహుమతులు అందించారు. డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు మాట్లాడుతూ, కెనడాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించడంలో ఇలాంటి వేడుకలు ముఖ్యమని పేర్కొన్నారు. తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా డా. బాబీ యానగావా, డివిజన్ హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్ హాస్పిటల్ హాజరై కార్డియో మరియు కుటుంబ ఆరోగ్యంపై సూచనలు అందించారు. అనంతరం డా. బాబీ, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల చేతుల మీదుగా డి.టి.సి ఎక్సలెన్సీ అవార్డులు ప్రదానం చేశారు. ఉషా నడురికి డి.టి.సి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు, సిరి వంశికా చిలువేరుకి డి.టి.సి ఆర్ట్స్, మ్యూజిక్-క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డు, శ్రేయస్ ఫణి పెండ్యాలకు డి.టి.సి ఆర్ట్స్-సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డు అందజేశారు. రామ్, సస్య పెద్ది, రామ్ జిన్నాల, రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల, రఘు జులూరి, గౌతమ్ పిడపర్తి, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, రాజశేఖర్, శ్రవంతి, యోగేశ్ జీ, పవన్ తదితరులు సహకరించారు.

గ్రేటర్ టొరాంటో ఏరియాలోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. డీ.టి.ఏ నుండి స్వాతి మీర్యాల, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (OTF) నుండి ప్రవీణ్ నీలా, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (BFC) నుండి జగపతి రాయల, సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (TTC) నుండి విజయ్ కుమార్ కోట, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్, డర్‌హమ్ హైదరాబాదీ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై DTC కార్యకలాపాలను అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి తెలుగువారి ఐక్యతను బలోపేతం చేసే కార్యక్రమాలు నిర్వహించడమే DTC లక్ష్యమని తెలిపారు.

Tags-Durham Telugu Club Family Fest In Toronto Canada

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles