ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాట్స్ సహకారం

Featured Image

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థుల కోసం NMMS (National Means & Merit Scholarship) పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను నాట్స్ అందించింది. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం ₹12,000 చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం ₹48,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ సహాయం పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రెండు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలలో మొత్తం సుమారు 26వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. నారాకోడూరులో జరిగిన కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ఎం.ఎల్.సి. లక్ష్మణరావు, నేషనల్ కోఆర్డినేటర్ (ప్రోగ్రామ్స్) కిరణ్ మందాడి, వెంకట్ కోడూరు, చైతన్య మాదాల తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

విద్యార్థులు పరీక్షకు అవసరమైన పుస్తకాల ముద్రణ, పంపిణీకి నాట్స్ సహకారం అందించింది. నారాకోడూరు హైస్కూల్‌లో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి నాట్స్ ముందుకొచ్చింది. ఇదే పాఠశాలలో STEM విభాగాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు నాట్స్ ముందుండి సహకారం అందిస్తుందని చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు.

Tags-NATS Helps 26000 Govt School Kids In Krishna Guntur Districts

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles