వేడుకగా ఖతర్ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ ఆసోసియేషన్ వార్షికోత్సవం

Featured Image

ఖతర్‌లోని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుక వైభవంగా జరిగింది. భారత ఎంబసీ ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ అతిథిగా పాల్గొని సంస్థ సేవలను అభినందించారు. ఆపదలో ఉండే తోటి ప్రవాసాంధ్రులకు చేయూతను ఇవ్వడం ముదావహమన్నారు. దైనందిన సమస్యలతో సతమతమయ్యే సగటు తెలుగు కార్మికులకు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తున్న సహాయాన్ని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం ఐ.సి.బి.యఫ్ అధ్యక్షుడు షానవాస్ బావా ప్రశంసించారు.

సంఘం కార్యకలాపాలను అధ్యక్షుడు నరసింహం జోశ్యుల వివరించారు. ఏపీ ప్రభుత్వం పునఃప్రారంభించిన ప్రవాసాంధ్ర బీమా పథకంలో ఈ సంవత్సరం ఖతర్ నుంచి తాము 200 మంది కార్మికుల బీమా రుసుమును చెల్లించనున్నట్లుగా నరసింహం వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ విభాగంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు, భారతీయ వంటకాల పోటీ విజేతలుగా నిలిచిన మహిళలను సత్కరించారు. అనన్య భాస్కర్ తన గేయాలతో సభికులను మంత్రముగ్ధులను చేసింది. వర్జిల్ బాబు తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల నాయకులు వెంకప్ప భాగవతుల, రజనీమూర్తి, నందిని, శంకర్ గౌడ్, ప్రముఖులు కె.యస్.ప్రసాద్, కృష్ణకుమార్, దీపక్ శెట్టి, నిలంబరీ తదితరులు పాల్గొన్నారు.

Tags-Qatar AndhraPradesh Welfare Association 2025 Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles