ఎట్టకేలకు...కోమటి జయరాంకు పదవి!

Featured Image

మైలవరానికి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు ఎన్నారై తెదేపా సమన్వయకర్త కోమటి జయరాంను ఎట్టకేలకు పదవి వరించింది. ఆయన గతంలో నిర్వహించిన ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తిరిగి నియమిస్తూ GAD CS శ్యామలరావు ఉత్తర్వులు వెలువరించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు ₹1.93లక్షలు అలవెన్సుల రూపంలో ప్రభుత్వం అందిస్తుంది.

గత ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రవాసాంధ్రులను సమన్వయించడంలో జయరాం కీలకంగా వ్యవహరించారు. ఉత్తర అమెరికాలో తెదేపా బాణీగా ఆయన మూడు దశాబ్దాలుగా సుపరిచితులు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18నెలల ఎదురుచూపుల అనంతరం జయరాం వంటి కీలక నేతకు పదవి దక్కడం పట్ల ఎన్నారై తెదేపా శ్రేణులు హర్షాన్ని వెలిబుచ్చాయి.

Tags-Komati Jayaram Appointed As North America Special Representative For Andhra Pradesh

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles