మేరీల్యాండ్‌లో ఘోర కారు ప్రమాదం...ప్రవాసాంధ్ర దంపతులు మృతి

Featured Image

మేరీల్యాండ్ రాష్ట్రం లారెల్ వద్ద I-95 హైవేపై శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్ర దంపతులు మృతి చెందారు. కొటికిలపూడి కృష్ణకిషోర్(50), ఆయన సతీమణి అప్పన వెంకట ఆషా(48)లుగా గుర్తించారు. వీరి కుమార్తె(23), కుమారుడు(16) గాయాలతో బయటపడ్డారు. పగో జిల్లా పాలకొల్లుకు చెందినవారిగా సమాచారం.

షార్లెట్ సమీపంలోని వాక్సాకు చెందిన వీరి విమానం వర్జీనియాలోని డల్లస్ విమానాశ్రయంలో దిగవల్సి ఉండగా అనివార్య కారణాల వలన విమానాన్ని దారిమళ్లించి న్యూయార్క్‌లో దింపారు. న్యూయార్క్ నుండి వర్జీనియాకు క్రైస్లర్ కారులో బయల్దేరిన వీరిని లారెల్ వద్ద తప్పుడు మార్గంలో ఎదురుగా వచ్చిన టయోటా వాహనం ఢీకొట్టగా దంపతులు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. టయోటా డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags-Telugu NRI Couple Kotikilapudi KrishnaKishore Venkata Asha Appana Died In Laurel MD Car Crash

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles