ఆంగ్ల భాష వినియోగం పెరిగితే మళ్లీ మనం బానిసలమవుతాం - జస్టిస్‌ ఎన్వీ రమణ

Featured Image

మాతృభాష పరిరక్షణ కోసం దీర్ఘకాల పోరాటం చేయాలని, ఈ ఉద్యమంలో పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. గుంటూరులో జరుగుతోన్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలుగు భాషతో మనకు సామాజిక బంధం, సాంస్కృతిక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆంగ్లభాష మాట్లాడితేనే గొప్ప అనే పరిస్థితి ఉంది. మన సాహిత్యాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. సంస్కృతి, చరిత్ర, నాగరికతను మనమే బలోపేతం చేసుకోవాలి. భాష అంతరిస్తే ఆ జాతి అంతరించినట్లేనని భావించాలి. తెలుగును రక్షించుకోవడం మన మౌలిక బాధ్యత, సాంస్కృతిక అవసరం. మన విద్యా విధానం వల్లే తెలుగు భాషకు కష్టాలు వచ్చాయి. మాతృభాష రాకుంటే మన పద్యం, గేయం, సాహిత్యాన్ని ఆస్వాదించలేం. మన సామెతలు, చతురోక్తులు మరిచిపోకూడదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ వారి భాషలోనే పనులు చేసుకుంటున్నాయి. చైనా, రష్యా, జపాన్‌, జర్మనీని చూసి అందరూ నేర్చుకోవాలి. ఆంగ్ల భాష వల్లే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలు వీడాలి. తెలుగులో చదువుకున్న వారు కూడా ఉన్నతస్థితికి వెళ్లారు. పిల్లలకు మాతృభాషను దూరం చేయొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. ఆంగ్ల భాష వినియోగం పెరిగితే మళ్లీ మనం బానిసలమవుతాం అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

Tags-Justice NV Ramana Speech In Guntur

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles