నాట్స్ బోర్డు నూతన ఛైర్మన్‌గా కంచర్ల కిషోర్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) బోర్డు నూతన ఛైర్మన్‌గా కంచర్ల కిషోర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ నుండి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో 2027 డిసెంబరు వరకు కొనసాగుతారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ డల్లాస్‌లో నివసిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ హోటళ్ల నిర్వాహకుడిగా, రియల్ ఎస్టేట్, ఐటీ రంగ వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం పట్ల ప్రవాసాంధ్రులు హర్షం వెలిబుచ్చారు. నాట్స్ బలోపేతానికి, సంస్థ ద్వారా ప్రవాస తెలుగువారి సంక్షేమానికి, తెలుగు భాషా-సంస్కృతుల పరిరక్షణకు కృషి చేస్తానని కిషోర్ తెలిపారు. కిషోర్‌కు నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి అభినందనలు తెలిపారు.

Tags-Krishna District Gudivada NRT Kishore Kancharla of Dallas Is NATS Board Chairman

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles