మూడు టన్నుల ఆహారాన్ని ఉచితంగా అందించిన తానా ఫిలడెల్ఫియా

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‌-అట్లాంటిక్‌(ఫిలడెల్ఫియా) విభాగం చరిత్రను సృష్టించారు. 8 వారాల పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమంలో 30 పరిసర ప్రాంతాల నుండి 3200కిలోలు ఆహారాన్ని సేకరించి స్థానిక ఫుడ్‌ బ్యాంక్‌లకు విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో 350 యువ వాలంటీర్లు పాల్గొన్నారు. దీని ద్వారా 1500 సర్టిఫైడ్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవర్స్‌ నమోదయ్యాయి. ఇది కాలేజీ ప్రవేశాల్లో యువతకు సహకరిస్తుంది. తానా చరిత్రలోనే గాక ఈ ప్రాంతంలో అతిపెద్ద యువ స్వచ్ఛంద కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంకుకు, హారిస్‌బర్గ్‌లోని న్యూ హోప్‌ మినిస్ట్రీస్‌కు ఈ ఆహారాన్ని అందజేశారు.

కోర్‌ టీమ్‌ సభ్యులు గోపి వాగ్వాల, వ్యోమ్‌ క్రోతపల్లి, సోహన్‌ సింగు, ధీరజ్‌ యలమంచి, క్రిషిత నందమూరి, అపర్ణా వాగ్వాల, సుజిత్‌ వాగ్వాల, ప్రణవ్‌ కంతేటి, లౌక్య పావులూరి, కేతన్‌ మామిడి, టియానా పటేల్‌, శ్రుతి కోగంటి, శ్రీకర్‌ కస్తూరి, మేధ యాగంటి, సితార నడింపల్లి, ఆర్నవ్‌ కంతేటిలు కీలకంగా వ్యవహరించారు. తానా అధ్యక్షుడు డాక్టర్‌ నరేన్‌ కొడాలి, బోర్డ్‌ డైరెక్టర్‌ రవి పొట్లూరి, మిడ్‌-అట్లాంటిక్‌ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్‌ కోఆర్డినేటర్‌ వెంకట్‌ సింగు, తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ సాయి బొల్లినేని, సతీష్‌ తుమ్మల, సునీల్‌ కోగంటి, సతీష్‌ చుండ్రు తదితరులు సమన్వయపరిచారు.

Tags-TANA Mid-Atlantic Philadelphia Team Donates 3200Kilos Free Food

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles