మహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

🕑 Published: April 16, 2026 at 01:25 PM CST

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద ప్రజల ఉపాధి అభివృద్ధికి దోహదపడే విధంగా వివిధ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులు చేతన ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డప్పటికీ స్వగ్రామాన్ని మరవకుండా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ్ళ రవి కుమార్ సేవా భావం ప్రశంసనీయం అని మహబూబాబాద్ డిఎస్పీ నంబూరి తిరుపతిరావు పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశ ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు 13 తోపుడు బండ్లు, మూడు పిండి మిల్లులు, మూడు ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఎల్మాస్ మాగ్నెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సిఎస్ఆర్ నిధులతో ఈ కార్యక్రమానికి సహకారం అందించగా, చేతన ఫౌండేషన్ సభ్యులు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు వెనిగళ్ళ రవి కుమార్ మార్గదర్శకత్వంలో బంధుమిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారి నిస్వార్థ సేవకు నిదర్శనం అని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు పోలీసు శాఖ నుండి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

తుమ్మలపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంధంపల్లి సర్పంచ్ భూక్యా ప్రవీణ్ కుమార్, బయ్యారం సిఐ రవీందర్, ఎస్ఐ తిరుపతి, చేతన ఫౌండేషన్ కెనడా ప్రతినిధి సీతారామారావు, సంస్థ అధ్యక్షుడు వెనిగళ్ళ అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వెనిగళ్ళ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ దొడ్డా సీతారామయ్య, సభ్యులు తాతా గణేష్, నవీన్, రషీద్, తోటకూర అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు చేతన ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్తడెలావేర్‌లో ఉగాది సాంస్కృతిక పోటీలుతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Huntన్యూయార్క్‌లో డా. నోరిని సత్కరించిన అమెరికన్ పంజాబీ సొసైటీడల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవంతితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుకు కీలక బాధ్యతలున్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితాUNMCతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పందంఆటా సాంస్కృతిక పోటీల నమోదుకు చివరి తేదీ ఇదేపుస్తకాలతోనే సంస్కారవంతమైన సామాజికాభ్యుదయం సాధ్యంవాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలుఅమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాది
Previous Article Next Article