🕑 Published: April 16, 2026 at 12:50 PM CST
డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం(TAGDV) ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది సాంస్కృతిక పోటీలు–2026 ఘనంగా నిర్వహించారు. పిల్లలు, యువత వివిధ వయో విభాగాల్లో పాటలు, నృత్యాలు, తెలుగు ప్రసంగ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమం మొత్తం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సుగంధంతో కళకళలాడింది. పోటీలకు లభించిన స్పందన, పిల్లలు చూపిన ప్రతిభ ప్రేరాణాత్మకంగా ఉందని, భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సంస్కృతిని చేరవేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీనివాస్, చాగంటి, డా. అన్నపూర్ణ చాగంటి, డా. మధు దౌలపల్లి, మహాలక్ష్మి నారాయణ, శివరంజని బతుల, హరికృష్ణ మహర్షి, కృష్ణ ప్రియ వోగేటి, సంగీత బాలచందర్, శ్రావణి నాగబండి, భారతి అశోక్, రవీనా తుమ్మల, సౌమ్య మడకసిరలు వ్యవహరించారు. యూత్ కమిటీ సభ్యులు — యుక్త బుంగటావుల, ఆదిత్య అనంతుని, అద్వైత్ బొందుగుల, తనిష్క కర్రోతు, స్థుతి రాకోతు, పార్ధ కర్రోతు, క్రీషిత నందమూరి, శ్రీ విద్యా రెడ్డి కర్ర, ఆర్యన్ పసుపుల కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. కవిత కురుకుండా, కృష్ణ నందమూరిలు మార్గదర్శకత్వం వహించారు. విశ్వనాథ్ కొగంటి, రమణ రాకోతు, ఆదీ గుప్తా సహకరించారు.
TAGDV అధ్యక్షుడు తులసి రామమోహన్ రావు తల్లూరి, ఉపాధ్యక్షుడు హరీష్ అన్నబత్తిన, కార్యదర్శి సురేష్ బొందుగుల, కోశాధికారి మధు బుడాటి, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, సహాయ కోశాధికారి శివ అనంతుని, సభ్యులు సునీత సిద్ధపురెడ్డి, విక్రమ్ అర్జుల, సురేష్ యలమర్తి, లవకుమార్ ఐనంపూడి, భాస్కర్ మక్కెన, గౌరి కర్రోతు తదితరులు పాల్గొన్నారు. మే 2న ఉగాది ఉత్సవాలు Downing town High School East, 50 Devon Dr, Exton, PA లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
