"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్త

🕑 Published: April 16, 2026 at 01:22 PM CST

19వ ఆటా కాన్ఫరెన్స్ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారవేత్తలకు సభల నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం అందించారు. తమ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించేందుకు, వ్యాపార గుర్తింపును పెంచుకునేందుకు, విస్తృతమైన విభిన్నమైన ప్రేక్షకులతో నెట్‌వర్క్ ఏర్పరుచుకునేందుకు ఆటా సభలు ఒక మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో ఈ సభలు నిర్వహించనున్నారు.

స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారికి ఏప్రిల్ 30 వరకు తగ్గింపు ధరలతో నమోదు అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం రిజిస్ట్రేషన్ రుసుములు పెరగనున్నందున ముందుగానే తమ స్థానం ఖరారు చేసుకోవాలని సూచించారు. వివరాలకు vendor@ataworld.org ఈమెయిల్‌కు, నవీన్ (571-426-6422), కల్పన (571-426-0383)ను సంప్రదించవచ్చు.

📲 Join Our WhatsApp Channel
డెలావేర్‌లో ఉగాది సాంస్కృతిక పోటీలుతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Huntన్యూయార్క్‌లో డా. నోరిని సత్కరించిన అమెరికన్ పంజాబీ సొసైటీడల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవంతితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుకు కీలక బాధ్యతలున్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితాUNMCతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పందంఆటా సాంస్కృతిక పోటీల నమోదుకు చివరి తేదీ ఇదేపుస్తకాలతోనే సంస్కారవంతమైన సామాజికాభ్యుదయం సాధ్యంవాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలుఅమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026
Previous Article Next Article