🕑 Published: April 13, 2026 at 12:56 PM CST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గత ఆదివారం నాడు అలెన్‌లోని రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సంప్రదాయ పూజలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పానకం వంటివి ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమల సమన్వయకర్త అనిత వేమిరెడ్డి స్వాగతోపన్యాసంతో వేడుకలు ప్రారంబమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు పద్య పోటీలు నిర్వహించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ భవిష్యత్ కార్యక్రమాలపై ప్రసంగించారు. ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. లైవ్ బ్యాండ్ "రీవైవల్" సంగీత ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అనిరుధ్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. యాంకర్లుగా మధురిమ, రాధా వ్యవహరించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వేడుకల సమన్వయకర్త అర్పిత రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగించారు.






