🕑 Published: April 05, 2026 at 11:49 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మిస్సోరి చాప్టర్ ప్రతినిధులు పేదలకు ఆహారం అందించే ఫుడ్‌బ్యాంక్ లో సేవలు అందించారు. బ్రిడ్జ్టన్ లోని సెయింట్ లూయిస్ ఏరియా ఫుడ్ బ్యాంక్‌లో ఈ సేవలు అందించారు. 30 మంది వాలంటీర్లు రెండు గంటల పాటు శ్రమించి, మొత్తం రెండున్నర టన్నుల ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, మధుసూధన్ దద్దాల, నరేష్ రాయంకులలు కీలకపాత్ర పోషించారు. తక్కువ సమయంలోనే ఇంత భారీ మొత్తంలో ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా సిద్ధం చేయడం పట్ల ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నాట్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.

