ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. NRI TDP Melbourne Inc ఆధ్వర్యంలో నిర్వహించిన “మనా నాయకుడు – మన రాజధాని” కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. వందలాది మంది తెలుగు ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి హాజరై తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ప్రసంగాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు వక్తలు చంద్రబాబు దూరదృష్టి, అభివృద్ధి పట్ల అంకితభావం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన చేసిన కృషిని ప్రశంసించారు.
NRI TDP Melbourne Inc అధ్యక్షురాలు వినీలా, ఉపాధ్యక్షురాలు కల్యాణి, అడ్వైజరీ సభ్యుడు బలుసు కిషోర్, పరిపూర్ణ, గోకుల్ లింగమనేని, రవితేజ, విలియమ్స్, దుర్గప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.