🕑 Published: April 20, 2026 at 09:19 AM CST
జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలు ఎన్ ఆర్ ఐ టీ డీ పీ, హాంబర్గ్, జర్మనీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. నాలుగు దశాబ్దాల పైబడిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం, ముఖ్య ఘట్టాలు, ఆయన అమలు చేసిన అభివృధి మరియు సంక్షేమ కార్యక్రమాలుతో చేసిన వీడియో ప్రదర్శించారు.
అమరావతిని ఆంధ్రుల రాజధానిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే విధంగా చంద్రబాబునాయుడు చేసిన అవిరళ కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వక్తలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు పాత్రని కొనియాడారు. చంద్రబాబు విజనరీ ఆలోచనల మీద ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ రచించిన "చంద్రబాబు నాయుడు X.0" పుస్తకం జర్మన్ మరియు ఫ్రెంచ్ భాషల అనువాద ప్రతులను పంపిణీ చేశారు. జర్మన్ అనువాద ప్రతులను జర్మనీలో ప్రముఖ నగరాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నామని టిట్టు మద్దిపట్ల, శివశంకర్ లింగం అన్నారు.
హాంబర్గ్ టీడీపీ టీం నుండి డాక్టర్ శివ శంకర్ లింగం, శశిధర్ ఏమిరెడ్డి, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, శ్రీకాంత్ గోళ్ళ, రాజా పులిచర్ల, శివ కోలా, చైతన్య యలమంచి, యాగేష్, నాగేంద్ర కూతురు, వఝల చాణక్య, భరత్ శీలంనేని, లక్ష్మీ పెర్నీడు బొల్లెంపల్లి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హిల్దిస్ హైం నగరం నుండి రామ రాయలు వట్టికూటి, బ్రిమెన్ నగరం నుండి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Frankfurt
చంద్రబాబు గొప్ప దార్శనికుడు, దేశం గర్వించదగ్గ నేత అని జర్మన్ తెలుగుదేశం నాయకులు శ్రీకాంత్ కుడితిపూడి కొనియాడారు. ఆదివారం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, బెలూన్లు ఎగురవేసి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన కార్యక్రమాన్ని పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి తదితరులు సమన్వయపరిచారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రోడ్డునపడ్డ తెలుగు జాతి పూర్వవైభవాలు తెచ్చేందుకు చంద్రబాబు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఉద్యోగ,ఉపాది అవకాశాలను మెరుగుపరుస్తున్నరన్నారు. పవన్ కుర్ర మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి అత్యునత పదవులకు అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని వెల్లడించారు.