🕑 Published: July 15, 2026 at 04:59 PM CST
* తొలి రోజు గోమాత పూజతో శ్రీకారం
* అగ్ని మథనం, వాస్తు గణపతి హోమంతో ఆధ్యాత్మిక వాతావరణం
సెయింట్ లూయిస్‌లోని హిందు ఆలయంలో అమెరికాలోనే తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మంగళవారం నాడు తొలి రోజు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చారణలు, యాగశాల ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది.
ఉదయం గోమాత పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, దీక్షా ధారణ, పంచగవ్య ప్రాశనం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలను వేద పండితులు అత్యంత వైదిక సంప్రదాయంలో నిర్వహించారు. కార్యక్రమాల ముగింపులో మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం యాగ కార్యక్రమాలు మరింత వైభవంగా కొనసాగాయి. పూజా ద్రవ్యాలు, దేవతా విగ్రహాలను శోభాయాత్రగా యాగశాలకు తీసుకువెళ్లగా భక్తులు భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన నిర్వహించారు. తదుపరి ధ్వజారోహణం, షోడశ స్తంభ పూజ, వేదిక పూజ ఘనంగా జరిగాయి. యాగానికి అత్యంత ముఖ్యమైన ఘట్టమైన అగ్ని మథనం ద్వారా పవిత్ర యజ్ఞాగ్నిని శాస్త్రోక్తంగా ఆవాహన చేసి యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం వాస్తు గణపతి హోమం నిర్వహించగా, భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తొలి రోజు కార్యక్రమాలు తీర్థ ప్రసాదంతో ముగిశాయి.
ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాయాగంలో ప్రతిరోజూ వివిధ శాస్త్రోక్త పూజలు, హోమాలు, చండీ పారాయణం, రుద్రయాగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ప్రపంచ శాంతి, లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
###
May Divine Mother Chandi and Lord Shiva bless all devotees with health, happiness, prosperity, and spiritual fulfillment.
Nava Kundathmaka Shatha Chandi Sahitha Rudra Yagam
July 14–19, 2026
The Hindu Temple of St. Louis
725 Weidman Road
Manchester, Missouri 63011, USA
Come in Devotion. Participate with Faith. Leave with Divine Blessings.
Chairmen- Rajanikanth Gangavarapu
Vice Chair - Vijay k Sakshi
Secretary - Kishore Janga
Treasurer - Murali Krishna Puttagunta
Steering Committee
* Rajanikanth Gangavarapu
* Vijay Sakshi
* Balanand Pinni
* Murali Gandi
* Kantha Rao Minnagenti
* Puran Lutra
* Muralikrishna Puttagunta
* Shantha Veerlapati
* Dr. Rammohan Reddy Paduru
* Kishore Yarlagadda
* Kishore Janga
Pooja Committee
* Keerthi Gaddipati
* SriDevi Bandi
Operations Committee
* Dr. Rammohan Reddy Paduru
* Co-Chair: Venkat Upamaka
* Co-Chair: Venkat Bandi
Invitations Committee
* Suren Byrapuneni
* Pallavi Surapaneni
* Muralikrishna Puttagunta
* Udhay Satya Gajula
* Kishore Janga
* Vijay Sakshi
* Balanand Pinni
* Seshu Enturi
* Krishna Rao Moharir
* Murali Gandi
* Kishore Yarlagadda
* Dr Dharmavarapu Venkateswara Rao
Cultural Committee
* Seema Jain
* Anitha Subramani
Media Committee
* Raja Surapaneni
* Cochair:Ravi Potla
Garland Committee
* Shantha Veerlapati
* Muktha Gatala
Prasadam Committee
* Pallavi Surapaneni
* Rajesh Evuri
* Co-Chair: Satish Lanka
Priest Food Committee
* Lavanya Kavuri
* Lakshmi Varabhatla
A/V Committee
* Harish Dhanalakota
* Krishna Baya Reddy
Venue Committee
* Satya Gajula
* Co-Chair: Sharath Bhimana
* Co-Chair: Shanmukh Puttagunta
Samoohika Kumkumarchana Committee
* Neelima Swarna
* Co-Chair: Anu Subbaraman
Samoohika Rudrabhishekam Committee
* Lakshmi Mallika Chitta
Publication Committee
* Hari Kavuri
* Swapna Kulkarni
Security & Parking Committee
* Srinivas UppalaPati
Hospitality Committee
* Rakesh Madineni
Building Committee
* Shashikanth Gajaraj
* Co-Chair: Satya Gajula
Command & Control Committee
* Kishore Yerlagadda
* Co-Chair: Srinivas Uppalapati
Reception Committee
* Uma Byrapuneni
* Malthi Reddy
Procurement Committee
* Vani Gangavarapu
* Sridhar Kondepudi
Advertisement Committee
* Damodar Paturi
Fundraising Committee
* Sharath Parekh
* Suren Byrapaneni
Souvenir Committee
* Hari Kavuri
* Kishore Janga
* Suraya Prakash Vinubhatla
Youth Committee
* Vidya Arunachalam
* Co-Chair: Sandya Subramanian
Finance Committee
* MuraliKrishna Puttagunta
* CoChair:Hema Bhaghavandas
* Puran Luthra







