🕑 Published: July 17, 2026 at 10:59 AM CST
అట్లాంటాకు చెందిన తెలుగు బాలిక కృష్ణవి కాసు ప్రతిష్ఠాత్మక 2026 యోనెక్స్ యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చింది. కాన్సాస్ రాష్ట్రంలోని విచిటా నగరంలో జూలై 8 నుంచి 14 వరకు జరిగిన ఈ పోటీల్లో అండర్-13 బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. బాలికల అండర్-13 డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించగా, అండర్-13 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి ఒకే టోర్నమెంట్‌లో మూడు విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చింది.
