అర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

🕑 Published: August 18, 2026 at 03:54 PM CST

డాలస్ పరిసర ప్రాంతం అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MGMNT వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల సభికులకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతోపన్యాసం చేశారు. సమీరా శ్రీపాద శిష్యులు అమెరికా జాతీయగీతంతో పాటు భారతదేశభక్తి గీతాలను ఆలపించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి అన్నారు. ప్రవాస భారతీయలు అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యఅతిథిగా అర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ..రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్‌ల మధ్య ధృఢమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని కొనియాడారు.

ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై పద్యాన్ని గానం చేశారు. వామరాజు సత్యమూర్తి, భారతదేశ సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రా, చెస్ ఛాంపియన్ సరయు తలపనేని, స్మారకస్థలి కో-ఛైర్మన్ తాయబ్ కుండావాలా, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపు, ఎం.వి.ఎల్ ప్రసాద్, ఏపీ మాజీ డీజీపీ డా. కె. అరవిందరావు తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
మెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీతానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలు
No Previous Next Article