దగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభం

🕑 Published: September 04, 2026 at 09:44 AM CST

​పుట్టిన గడ్డపై మమకారం, ప్రజల ఆరోగ్యం పట్ల అంకితభావంతో సొంత గ్రామమైన కారంచేడులో దగ్గుబాటి కుటుంబ సభ్యుల సహకారంతో నాలుగు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చొరవతో ONGC CSR నిధుల ద్వారా లభించిన రూ.3కోట్లకు వారి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ తన సొంత నిధులు మరో రూ.1కోటి వెచ్చించి మొత్తం రూ.4కోట్లతో నాలుగు భారీ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

గ్రామంలోని జయప్రకాష్ నారాయణ చెరువు వద్ద 2 ప్లాంట్లు, హరిజనవాడ చెరువు వద్ద 1 ప్లాంట్ , లైబ్రరీ చెరువు వద్ద ఒక ప్లాంట్ నిర్మించారు. చెరువు నీటిని అధునాతన ఓజోనేషన్ పద్ధతితో పలు దశల్లో శుద్ధి చేసి పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మినరల్ వాటర్‌ను గ్రామంలోని 3500 ఇళ్లకు ఇంటింటికీ సరఫరా చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ​రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ​స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ​బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, ​ప్రాజెక్టు నిర్వహణ భాగస్వామి 'రాంకీ' సంస్థ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కారంచేడు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

📲 Join Our WhatsApp Channel
YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవ
Previous Article Next Article