🕑 Published: August 27, 2026 at 11:22 AM CST
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డాక్టర్ జగదీశ్‌ను తిరుపతి జిల్లా స్విమ్స్ డైరెక్టర్‌గా నియమించామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. గురువారం స్విమ్స్ డైరెక్టర్‌గా జగదీశ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. జగదీశ్ అనుభవంతోపాటు గొప్ప పేరు, దూరదృష్టి ఉన్న వైద్యుడని అన్నారు. దేశం గర్వించదగిన వైద్యుల్లో ఆయన ఒకరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్విమ్స్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. స్విమ్స్, బర్డ్‌తోపాటు తితిదే వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అనంతరం డాక్టర్ జగదీశ్ మాట్లాడుతూ బీఆర్ నాయుడు ఉత్తర్వులతో బర్డ్, స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా అవకాశం దక్కిందన్నారు.


