సెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవం

🕑 Published: August 27, 2026 at 11:54 AM CST

మిషిగన్ రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాయ్ తెలుగు అసోసియేషన్ (Troy Telugu Association) 20వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. 2006లో ప్రారంభమైన ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, సభ్యులు–దాతల సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. 1050 మంది సభ్యులు కలిగిన ఈ సంస్థ 20వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్లూమ్‌ఫీల్డ్ హిల్స్‌లో నిర్వహించనున్నారు.

వేడుకల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు, యువత–ఆర్థిక అంశాలపై సెమినార్లు, తెలుగు పాటల పోటీ, ఒక నిమిషం రీల్/షార్ట్ వీడియో పోటీలను నిర్వహిస్తున్నారు. పాటల పోటీలో 16 ఏళ్లలోపు పిల్లలకు, 16ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. Passing Our Culture to New Generations అనే అంశంతో రీల్/షార్ట్ వీడియో పోటీని నిర్వహిస్తున్నారు. పోటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతదేశంలోని అవసరాల్లో ఉన్న మహిళలకు సహాయం చేసే HAND (Human Action for Need and Development) కార్యక్రమానికి అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.

కార్యవర్గం, నాయకులు వంటి పరిమితులకు లోబడకుండా ట్రాయ్ తెలుగు సంఘం కేవలం సభ్యుల చేత నిర్వహించబడే ప్రవాస తెలుగు సంస్థగా గుర్తింపు పొందింది. సభ్యులు, వాలంటీర్లు, దాతల సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 20వ వార్షికోత్సవ వేడుకలకు St. Martinus University, Smile Centers గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. వేడుకల ప్రాంగణంలో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, తెలుగు కుటుంబాలు, యువత, పిల్లలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. అతిథులకు ప్రవేశం ఉచితం. కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు సంస్థ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
స్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవంమెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీతానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం
No Previous Next Article