🕑 Published: August 26, 2026 at 10:55 AM CST
1926లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2026 ఏప్రిల్‌లో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దేశంలోని అత్యంత ప్రాచీన, ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలంలో ఎందరో మేధావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, దార్శనికులు, నాయకులను తీర్చిదిద్దింది. విశాఖలోని ఏయూ ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా అక్టోబర్ 10న టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏయూలో సైన్స్, ఆర్ట్స్, లా, ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా నిర్వాహకులు కోరారు.
ఆసక్తి కలిగిన పూర్వ విద్యార్థులు సెప్టెంబరు 20వ తేదీ లోపు ఈ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
https://docs.google.com/forms/d/1TVC3GHY6Rki-g7jHWFZmF-IPoBQGk2H86ETREIEov48/viewform?edit_requested=true
