నెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్

🕑 Published: September 01, 2026 at 09:34 AM CST

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన 5కె రన్/వాక్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో శనివారం నాడు ఒమాహాలోని చాల్కో హిల్స్ రిక్రియేషన్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. "Stronger Together – Healthier Together – Better Together"” నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం యోగా స్ట్రెచింగ్‌తో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం 5కె రన్/వాక్ కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను అమెరికాలో చిన్నారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న Completely KIDS సంస్థతో పాటు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక అవసరాలకు తోడ్పడే సేవా కార్యక్రమాలకు అందించనున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. గురుదత్ పెండ్యాల, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కాశి మక్కంలు హాజరయ్యారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమమైన వ్యాయామం ప్రాముఖ్యతను వివరిస్తూనే, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తాతారావు కోసూరి, రాజేష్ నాయక్వాడి, TSN కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్లు, కోర్ టీమ్ సభ్యులు, వాలంటీర్లు కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. పురుషుల విభాగంలో ఐదుగురు, మహిళల విభాగంలో ఐదుగురు, 10 సంవత్సరాలు పైబడిన చిన్నారుల విభాగంలో పది మంది, 10సంవత్సరాల లోపు చిన్నారుల విభాగంలో పది మందికి బహుమతులు అందజేశారు.

📲 Join Our WhatsApp Channel
మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం
Previous Article Next Article