🕑 Published: August 28, 2026 at 03:28 PM CST
మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో వార్షిక 5కె వాక్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులు, కుటుంబాలు, చిన్నారులు, వాలంటీర్లు, స్పాన్సర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. నేత్ర వైద్యం అవసరమైన వారికి చేయూత ఇవ్వడానికి విరాళాలు అందజేయాలని ప్రతినిధులు కోరారు. నిర్వాహకులను శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి అభినందించారు. ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, విజయ్ పెరుమాళ్ళ, రవి కవుతరపు, వెంకట్ గోటూర్, త్రిపుర సుందరి భాగవతుల, వాలంటీర్ల(సాయి గోపిసెట్టి, శిరీషా ఉప్పలపాటి, రజని బేతిన, అనిత బొమ్మనవేని) నిర్వహణకు కృషి చేశారు.

