పల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్ష

🕑 Published: October 10, 2026 at 07:58 PM CST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడిని అమెరికా తీసుకెళ్లి, తీవ్రంగా హింసించిన కేసులో సెయింట్ లూయిస్ కోర్టు శిక్ష విధించింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెం గ్రామానికి చెందిన మార్తల పుల్లారెడ్డిని అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకురాలు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సత్తారు పుష్పారెడ్డి కుమారుడు సత్తారు వెంకటేశ్‌రెడ్డి (38) 2022లో అమెరికా తీసుకెళ్లాడు. ఇంటర్‌ పూర్తిచేసిన పుల్లారెడ్డిని చదివించి, ఉద్యోగం వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. పుల్లారెడ్డి అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్‌రెడ్డి ఇంట్లో ఉంటూ ఇంటి పనులతో పాటు ఆయన కంపెనీలో పని చేసేవారు.

ఈ క్రమంలో నిందితుడు.. నిఖిల్, శ్రవణ్‌ అనే వ్యక్తులతో కలిసి పుల్లారెడ్డి పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఇమిగ్రేషన్‌ పత్రాలు లాక్కోవడమే కాకుండా నిద్ర లేకుండా చేయడం, తిండి సరిగ్గా పెట్టకపోవడం, బాత్రూమ్‌ వంటి కనీస సదుపాయాలు ఇవ్వకపోవడం వంటి చర్యలతో హింసించారు. ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేవారు. దీనిపై 2023లో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం వైకాపా నేత వెంకటేశ్‌రెడ్డికి 50 నెలల కఠిన జైలు శిక్ష విధించింది. సహ నిందితులు నిఖిల్‌ (30)కు 37 నెలల జైలుశిక్ష, శ్రవణ్‌ (26)కు 30 నెలల జైలుశిక్ష పడింది. అమెరికా సైన్యంలో మాజీ ఉద్యోగైన వెంకటేశ్‌రెడ్డి తన వైకల్యాన్ని ఎక్కువగా చూపించి అక్కడి ప్రభుత్వం నుంచి 83,776 డాలర్లు (సుమారు రూ.81 లక్షలు) అదనంగా పొందినట్లూ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి 74,634 డాలర్లు (సుమారు రూ.72 లక్షలు), యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వెటరన్స్‌ ఎఫైర్స్‌కు 83,776 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

https://www.justice.gov/usao-edmo/pr/st-charles-county-residents-sentenced-prison-forced-labor-case

📲 Join Our WhatsApp Channel
షార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రం
❮ No Previous Next Article ❯