న్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలు

🕑 Published: October 13, 2026 at 02:59 PM CST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని న్యూజెర్సీలో భారతీయ అమెరికన్ సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014 మే నెల నుంచి భారత ప్రధానమంత్రిగా కొనసాగుతూ, దేశ అభివృద్ధికి అందిస్తున్న నాయకత్వాన్ని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ నిరుపమ్ బాజ్‌పాయ్ పాల్గొని ప్రసంగించారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం అనంతరం, భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పరిశోధనల ప్రాధాన్యతను అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గుర్తించారని ఆ దిశగా 2003లో గుజరాత్ ప్రభుత్వం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్‌ను స్థాపించిందని గుర్తుచేశారు. ఈ ప్రయత్నంలో కొలంబియా విశ్వవిద్యాలయం భాగస్వామ్యాన్ని వివరించిన ఆయన, శాస్త్రీయ పరిశోధనలకు మోదీ ఇచ్చిన ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రశంసించారు. వాజ్‌పేయి, మోదీ సహా ముగ్గురు భారత ప్రధానమంత్రులకు సలహాదారుగా పనిచేసిన తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. మోదీ దార్శనికతకు అనుగుణంగా 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్ఏ(OFBJP-USA) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని, భారత ప్రధానమంత్రిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. సుపరిపాలన, వేగవంతమైన అభివృద్ధి, అన్ని రంగాల్లో సమగ్ర పురోగతికి మోదీ నాయకత్వం భవిష్యత్ తరాల నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాకుండా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని కొనియాడారు. OFBJP-USA ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసు పటేల్, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబులాలు ప్రసంగిస్తూ మోదీకి అభినందనలు తెలిపారు. భజాపాకు అండగా నిలుస్తూ భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లే ప్రయాణంలో తమ వంతు పాత్ర పోషిస్తామని అన్నారు. అమర్ గోస్వామి, కల్పనా శుక్లా, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, ఆనంద్ గుప్తా, ప్రదీప్ కట్టా, గోవింద్ రాజ్ తోట, గోపి సముద్రాల, శ్రవణ్ కల్సాని, మధు అన్న, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
లండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
❮ Previous Article Next Article ❯