హ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.

🕑 Published: October 16, 2026 at 11:51 AM CST

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) హ్యూస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో "Innovation – Invest in Andhra Pradesh" పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) శ్రీనివాస్ మిరియాలను సత్కరించారు. ఏపీఎన్ఆర్‌టీ సౌత్-వెస్ట్ కోఆర్డినేటర్ సాయి రాజ్ కొత్తమాసు, టెక్సాస్ స్టేట్ కోఆర్డినేటర్లు గోపాల్ గూడపాటి, రత్న ప్రసాద్ గుమ్మడి, రాజేష్ యాళ్ళబండి, హ్యూస్టన్ సిటీ కోఆర్డినేటర్ సురేష్ సత్తి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మిరియాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడి అవకాశాలను వివరించారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించిన ‘స్వర్ణాంధ్ర–2047’ ప్రణాళికతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన తొమ్మిది అంశాలను ప్రస్తావించారు. అమరావతి రాజధాని, జల భద్రత, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, గ్లోబల్ లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలను విపులీకరించారు. రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్షం, డ్రోన్లు, క్వాంటం టెక్నాలజీ, ఫార్మా, వైద్య పర్యాటకం, అరుదైన ఖనిజాలు తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వట్టెం నరేంద్రబాబు భవిష్యత్ AI ప్రణాళికలపి ప్రసంగించారు. సమావేశంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

📲 Join Our WhatsApp Channel
హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డు
❮ Previous Article Next Article ❯