🕑 Published: November 29, 2026 at 10:08 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 2025 నుండి ఇప్పటివరకు పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి 50వ కార్యక్రమంగా ఈ లేడీస్ నైట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన మహిళలు ఒకే చోట చేరి సంగీతం, నృత్య ప్రదర్శనల్తో సరదాగా గడిపారు. మహిళా విభాగం కోఆర్డినేటర్ దీప్తి కోకా, సరోజ పావులూరి, మనీషా మేక, సౌజన్య కొగంటి, బిందు ఆలపాటి, రమ్య పవులూరి, భవాని మామిడి, శైలజ కస్తూరి, రవీనా తుమ్మల, భవాని క్రోతపల్లి తదితరులు సహకరించారు. 50 విజయవంతమైన కార్యక్రమాల మైలురాయిని చేరుకున్న మిడ్-అట్లాంటిక్ బృందానికి తానా కార్యవర్గం అభినందనలు తెలిపింది. లక్ష్మి మండా, మమత వెండి నానేం గెలుచుకోగా ఉష బంగారు నాణెం గెలుచుకున్నారు. చీరలను కూడా బహుమతులుగా అందించారు. శ్వేత కొమ్మజి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటిని, ప్రసాద్ క్రోతపల్లి, సురేష్ యలమంచి, రంజిత్ మామిడి, సునీల్ కొగంటి, ప్రసాద్ కస్తూరి, కోటి యాగంటి, ధీరజ్ యలమంచి, ప్రణవ్ కంతేటి, కేతన్ మామిడి, ఆర్నవ్ కాంతేటి, కార్తీక్ మామిడిలు సహకరించారు.






