Australia..ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ దీక్ష దివస్

🕑 Published: November 29, 2026 at 10:11 AM CST

ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ హరి రమాదేవి హాజరయ్యారు.

ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పిన కీలక ఘట్టం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాల్లోనే ఒక కీలక మలుపుగా నిలిచిందని, ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, యువత, వివిధ ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం జరిగిన ప్రస్థానంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

హరి రమాదేవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని, ఆస్ట్రేలియాలో కూడా బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తున్న అనిల్ బిరెడ్డి గారి టీంను అభినందించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా తమ మాతృభూమి పట్ల ఉన్న ప్రేమను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరచిపోరని అనిల్ బైరెడ్డి తెలిపారు. భావితరాలకు కెసిఆర్ గారి త్యాగాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రను తెలియజేయడం, అమరవీరుల త్యాగాలను గుర్తుచేయడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని అన్నారు. నవంబర్ 29 న కరీంనగర్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిధిగా జరగబోయే "దీక్షా దివస్" సభకు లక్షలాదిగా హాజరై విజయవంతం చెయ్యాలని అనిల్ బైరెడ్డి బృందం పోస్టర్ ఆవిష్కరించి పిలుపునిచ్చారు. రమేష్ బాబు హరి, సత్య గుండా, రవీందర్ చుక్క, రాహుల్ నాడిదే, దీపక్ హరి, ప్రవీణ్, పవన్ రెడ్డి, నవీన్, కుల్విందర్ బజ్వా, శ్యామ్ లింగంపల్లి, రఘు, సిరిష, దీప్తి, సతీష్ మాచర్ల, కవల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
USA..తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో లేడీస్ నైట్USA..ఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణతితిదేకు 14టన్నుల కూరగాయలు విరాళం ఇచ్చిన కొల్లావారిపాలెం గ్రామస్థులుUSA..1000కిలోల ఆహారాన్ని విరాళంగా అందజేసిన ఆటా-న్యూజెర్సీఏలూరు జిల్లాలో తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలుMalaysia..ఉత్సాహంగా BAM దీపావళి–దసరా ఉత్సవ్USA..అట్లాంటాలో విశాఖ ప్రవాసుల సమావేశండిసెంబరు 20న డా. దగ్గుబాటి రచించిన అంతర్వీక్షణం పుస్తకావిష్కరణహాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతంసిరికోన సాహితీ అకాడెమీ తెలుగు నవలల పోటీ – 2026Netherlands..కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవంUSA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయUSA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటన
❮ Previous Article Next Article ❯