🕑 Published: July 10, 2026 at 11:31 AM CST
తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో అమెరికాలోని వర్జీనియాలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ బోయినపల్లి సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, 19వ ఆటా మహాసభల సమన్వయకర్తలు రవి చల్లా, జీనత్ కుందూర్తో పాటు సంస్థ సభ్యులు, ఎర్రబెల్లి మిత్రులు హాజరయ్యారు. దయాకరరావు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లో 19వ ఆటా మహాసభలు నిర్వహిస్తున్నారు.

