న్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతి

🕑 Published: July 15, 2026 at 05:44 AM CST

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) మృతి చెందారు. రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.

మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి. పెద్ద కుమార్తె మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దీంతో ఉమ్మడివరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. మృతురాలి తండ్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

📲 Join Our WhatsApp Channel
న్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశంఅమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగంవైభవంగా న్యూజెర్సీ మోన్రో టౌన్‌షిప్ సాయిబాలాజీ ఆలయ భూమిపూజమనస్సున్న మా"రాజు" వై.ఎస్ - డల్లాస్‌లో ఘనంగా జయంతి వేడుకశంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరిఎర్రబెల్లికి ఆటా సన్మానంYSR Jayanthi Celebrations in Dallas On July 11thశనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సు
Previous Article Next Article