🕑 Published: October 16, 2026 at 11:55 AM CST
పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం, గోపువానిపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు డిజిటల్ చిత్రపటాన్ని ఆయన కుమార్తె, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పేరుతోనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం గుర్తుకు వస్తాయని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగించి, సామాన్యుడికి పాలనను చేరువ చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని గ్రామంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు.
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, టీడీపీ నేతలు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కృష్ణాజిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు రామినేని కుటుంబయా, రోటరీ గవర్నర్ గుంటూరు వెంకట రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


