జాతీయ మెడికల్ కమీషన్ ఛైర్మన్‌గా అభిజీత్. అభినందనలు తెలిపిన డా. ఈదర.

Featured Image

భారత జాతీయ మెడికల్ కమీషన్(NMC) ఛైర్మన్‌గా గుజరాత్‌కు చెందిన డా. అభిజత్ చంద్రకాంత్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం భారత జాతీయ వైద్య విద్య పరీక్ష మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయనను కేంద్ర కేబినెట్ ఈ నూతన పదవిలో నియమించింది.

భారతదేశ వ్యాప్తంగా వైద్య విద్య ప్రణాళికలు, వైద్య విద్యాసంస్థల ఏర్పాటు, నియంత్రణ, వైద్యుల నియామకం వంటి కీలక అంశాలను జాతీయ మెడికల్ కమీషన్ పర్యవేక్షిస్తుంది.

డా. అభిజత్ నియామకం పట్ల ప్రవాసాంధ్రుడు, మిషిగన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. ఈదర లోకేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. డా. అభిజత్‌తో కలిసి తాము పనిచేశామని, న్యూయార్క్‌లో నిర్వహించిన AAPI సమావేశాలకు ఆయన హాజరయ్యారని, ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన భారతదేశంలో వైద్య వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు.

Tags-Abhijat Seth Appointed As NMC Chairman. Dr.Edara Lokesh Applauds His Appointment.

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles