డాలస్‌లో భారత కాన్సులర్ సేవలు ప్రారంభం

Featured Image

వాషింగ్టన్ డి.సి.లోని భారత రాయబార కార్యాలయం డాలస్ నగరంలో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్(ICAC)ను శుక్రవారం నుండి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (IAFC) అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర హర్షం వెలిబుచ్చారు. ప్రవాస భారతీయల సంఖ్య అధికంగా ఉన్న డాలస్ నగరంలో ఇలాంటి ఒక కేంద్రం కావాలని ఎన్నో ఏళ్లగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అది ఇప్పటికి సాకారం కావడం సంతోషదాయకం అన్నారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సేవలు, వీసా దరఖాస్తులు, జనన మరియు వివాహ రిజిస్ట్రేషన్లు వంటి కాన్సులర్ సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చునని తెలిపారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా, కాన్సల్ జనరల్ డి. సి మంజునాథ్, వి.ఎఫ్.స్ అధికారులకు ప్రవాస భారతీయుల తరపున డా. ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు.

Tags-Indian Consular Services Started In Dallas By VFS

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles