కాలిఫోర్నియాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు...ప్రత్యేకార్షణగా తానా శకటం

Featured Image

అసోసియేషన్ అఫ్ ఇండో అమెరికన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తానా స్వర్ణోత్సవ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా స్థాపించి 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తానా కాలిఫోర్నియా విభాగం ప్రత్యేక శకటాన్ని రూపొందించారు.

తానా ఫౌండేషన్ ట్రస్టీ భక్త బల్ల, బోర్డు డైరెక్టర్ వెంకట్ కోగంటి, ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ వెంకట్రావు అడుసుమల్లి, నార్తెర్న్ కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ ఉన్నం, సథరన్ కాలిఫోర్నియా కోఆర్డినేటర్ హేమకుమార్ గొట్టి, ప్రదీప్ కన్నా, శ్రీనివాస్ కొల్లి, వెంకట్ కొల్ల, భాస్కర్ వల్లభనేని, శ్రీకాంత్ దొడ్డపనేని, రామ్ మారం, రజని మారం, నేతాజీ గుర్రం, సందీప్ నాయుడు రథినా, ఆనంద్ పాల్గొన్నారు. అతిలూత్ కట్టు అల్లురి సీతారామరాజు వేషాధారణలో ఆకట్టుకున్నాడు.

ఈ కార్యక్రమానికి బే ఏరియా నుండి 50 భారతీయ సంస్థలు, పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. శాన్‌హోసే వీధుల్లో 75 శకటాలతో భారీ పరేడ్ నిర్వహించారు. జెండా వందనం కార్యక్రమంలో బాలీవుడ్ నటి అమీషా పటేల్ (గ్రాండ్ మార్షల్), ఎర్త్ క్లీన్స్ ఫౌండర్ శ్రీకాంత్ బొల్లా(గెస్ట్ ఆఫ్ ఆనర్), డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రాకేష్ అడ్లఖా(ఎస్ఎఫ్ ఓ) పాల్గొన్నారు.

Tags-TANA Tableaux At Independence Day Celebrations In California

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles