ఘనంగా ముగిసిన TAL ప్రీమియర్ లీగ్ (TPL) క్రికెట్ 2025

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) వార్షిక క్రికెట్ పోటీలు TAL ప్రీమియర్ లీగ్ 2025 విజయవంతంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లు లాంగ్లీ, స్లౌ క్రికెట్ క్లబ్‌లో జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో IT Tree Warriors విజయం సాధించి ఛాంపియన్లుగా నిలిచారు. గట్టి పోటీ ఇచ్చిన Golden Boys రన్నరప్‌గా నిలిచారు. మూడవ స్థాన పోరులో Super Stars గెలుపొందారు. Vizag Blues ఫెయిర్ ప్లే అవార్డు అందుకున్నారు.`

TPL 2025 విజేతలు

ఛాంపియన్స్ IT Tree Warriors

రన్నరప్ Golden Boys

మూడవ స్థానం Super Stars

ఫెయిర్ ప్లే అవార్డు Vizag Blues

వ్యక్తిగత పురస్కారాలు

Man of the Series ఆకాష్ బండారి

ఉత్తమ బౌలర్ గోపి ముప్పాళ్ల

ఉత్తమ బ్యాట్స్‌మన్ చందు నూతలపాటి

ఉత్తమ ఫీల్డర్/కీపర్ శ్రవణ్ తేజ

మహిళల క్రికెట్ ప్రోత్సాహం కోసం అదే రోజు నిర్వహించిన తెలుగు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (TWPL) – T10 టోర్నమెంట్‌లో Magic Girls జట్టు Galaxy Girls పై గెలిచి ఛాంపియన్లుగా నిలిచింది. 14 వారాలపాటు జరిగిన టోర్నమెంట్‌లో 10 జట్లు, 200కుపైగా ఆటగాళ్లు 51 మ్యాచ్‌ల్లో ప్రతిభ ప్రదర్శించారు. క్రీడాస్ఫూర్తి, సమాజ సమైక్యత, వినోదంతో నిండి ఈ కార్యక్రమాన్ని ఆటగాళ్లు, వాలంటీర్లు, అభిమానులు విజయవంతం చేశారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన TAL స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సత్య పెద్ది రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. TPL కమిటీ సభ్యులు సుభానీ షేక్, శ్రీకాంత్ జెడ్డా, మునీర్ షేక్, హర్ష కగితాల, సిద్దార్థ్ కశ్యప్ గుర్ల మరియు ట్రస్టీలైన కిరణ్ కప్పేట, అనిల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, రవి మోచెర్ల, వెంకట్ నీలా గార్లకు సహాయ సహకారాలు అందించినందుకుగాను ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక ధన్యవాదాలు

TPL 2025 స్టీరింగ్ కమిటీ అనిత నోముల, వాసు మేరెడ్డి

వాలంటీర్ టీం సుభాని మొహమ్మద్ షేక్ , హర్ష కాగితాల , సూర్య కార్తీక్ , సింధు శ్రీనివాస్ , మీనా

TPL అడ్వైజరీ టీం సంజయ్ బైరాజు, శ్రీధర్ మెడిచెట్టి, రవీందర్ రెడ్డి, కిరణ్ కప్పేటా

డిసిప్లినరీ కమిటీ వంశి మోహన్ సింగులూరి, శ్రీధర్ సోమేశెట్టి, శరత్ జెట్టి, భారతి కందుకూరి

Tags-TAL Premier League TPL 2025 In London

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles