అమెరికాతో వాణిజ్య యుద్ధం ఇండియాకు మంచిది-IFS అధికారి రాజశేఖర్

Featured Image

అమెరికాతో వాణిజ్య యుద్ధం ద్వారా భారత్‌కు మంచి లాభమని విశ్రాంత IFS (Indian Foreign Services) అధికారి చింతపల్లి రాజశేఖర్ అన్నారు. ఆదివారం నాడు డల్లాస్ పర్యటనలో భాగంగా అర్వింగ్‌లో ఆయన ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాంగ విధానాల వలన రెండు దేశాల మధ్య భద్రత, సమృద్ధి అనే అంశాలకు ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ఆంక్షల కారణంగా చైనా భారత్‌కు స్నేహహస్తం చూపుతుందని తద్వారా మనకు అపార వాణిజ్య అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇండియా శాసిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో హరిహర పీఠం నిర్వాహకుడు సుబ్రహ్మణ్య శర్మ, కేసీ చేకూరి, చింతమనేని సుధీర్, కొల్లా అశోక్‌బాబు, వీరవల్లి శ్రీనివాస్, కాజా చందు, జిల్లెళ్లమూడి వెంకట్, పవన్, కిరణ్, మనోహర్, చుంచు రాఘవ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags-Retd IFS Officer Chinthapalli Rajasekhar Meets NRIs In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles