
ఈ శనివారం ఫ్రిస్కోలో సాకేత్ ఫౌండేషన్ 5కే వాక్

బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం సాకేత్ ఫౌండేషన్ వార్షిక 5కే వాక్ ఈ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో నిర్వహిస్తున్నట్లు అతని తల్లిదండ్రులు శ్రీనివాస్-లక్ష్మీలు తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం నిధుల సేకరణకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ ఏడాది సాకేత్ ఫౌండేషన్ 5కే వాక్ 14వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. గత సంవత్సరం 15వేల డాలర్లు సేకరించారు. దానికి మరో 6వేల డాలర్లు కలిపి మొత్తం 21వేల డాలర్ల నిధులతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
* పిల్లలకు రక్త మార్పిడి, ఔషధాల కోసం Thalassemia Needs Societyకు $12,000 సహాయం.
* బెంగళూరులోని మహావీర్ జైన్ ఆసుపత్రిలో తేజస్విని బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ కోసం $6,000
* క్యాన్సర్‌తో పోరాడుతున్న పూజిత వైద్య ఖర్చులు, మందులకు $1,600.
* బధిరుల పాఠశాలకు విద్యా సహాయార్థం $3,000.
ఈ శనివారం జరిగే కార్యక్రమంలో ప్రవాసులు పాల్గొనాలని, నగదు, చెక్కులతో లేదా Zelle: 732-423-5424 ద్వారా విరాళాలు అందించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. వాక్‌లో పాల్గొనేవారు పసుపు లేదా తెలుపు దుస్తులతో రావాలని శ్రీనివాస్-లక్ష్మిలు కోరారు. మరిన్ని వివరాలకు: www.sakethfoundation.org చూడవచ్చు.

Latest Articles
- Tal Premier League Tpl 2025 In London
- Nats Helps Ashrams In Sattenapalli
- Tdp Mla Koona Ravikumar Meets Nri Tdp Chicago Cadre
- Medasani Mohan Pravacanam On Ramayanam In Singapore
- Tana Mid Atlantic Team Conducts 2025 Chess Tournament
- Retd Ifs Officer Chinthapalli Rajasekhar Meets Nris In Dallas
- Nats Robotics Work Shop For Kids
- Venkateswara Temple Opened In Frisco Ksht
- Tana Dfw Donates Backpacks To Poor Kids In Heb Isd
- Ap Library Parishat Chairman Gonuguntla In Washington Dc
- Katasani Rambhupal Reddy To Tour Frisco Nri Ysrcp
- Mandali Foundation Award To Justice Nv Ramana
- Ata Hosts Successful Regional Business Summit In Atlanta
- America Telugu Assoc Ata Summer Picnic In Washington Dc
- Justice Lavu Nageswara Rao Appreciate Nuthi Bapu For His Charity To Pedanandipadu School
- Aamudalavalasa Mla Kuna Ravikumar Tours Boston And Meets Nri Tdp Cadre
- Telugudesam General Secretary Nmd Firoz Meets Chicago Nri Tdp
- Gwtcs Pickle Ball 2025 Competition
- Philadelphia Tana Conducts Social Media Internship
- Indian Consular Services Started In Dallas By Vfs