మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Featured Image

మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో "మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ" సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మలేసియా-తెలుగు వెల్ఫేర్-కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ, మలేసియా పెళ్లిచూపులు అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేసియా(FNCA), భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా వంటి అనేక తెలుగు మరియు ఎన్ఆర్ఐ సంస్థల భాగస్వామ్యం ఈ వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సేవా కార్యక్రమాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో భారత హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మరియు నటుడు మురళీమోహన్, సీనియర్ నటుడు ప్రదీప్ తదితరులు పాల్గొని తెలుగు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు డాటో కాంతారావు ప్రత్యేక అతిథులను మరియు కమిటీ సభ్యులను సత్కరించారు. మురళీమోహన్ సేవలను స్మరించుకుంటూ ప్రదర్శించిన స్మారక వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనాథ పిల్లలకు బహుమతులు అందజేయడం ద్వారా చారిటీ లక్ష్యం నెరవేర్చబడింది. FNCA అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి, భారతీయ అసోసియేషన్ అధ్యక్షుడు చోప్పరి సత్య సామాజిక సేవ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఈ వేడుక మలేసియా తెలుగు సమాజం ఐక్యతను, వారసత్వ గౌరవాన్ని, మలేషియాపై ప్రేమను ప్రతిబింబించింది.

Tags-Malaysia Telugu Foundation Celebrates 68th Malaysian Independence Day

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles