నాట్స్ సామాజిక సేవ కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రయోజనం

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సామాజిక సేవకు గాను విద్యార్థుల శ్రమను అమెరికా ప్రభుత్వం వాలంటీర్ అవర్స్‌గా గుర్తిస్తుంది. ఇది వారి కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది.

నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు సమన్వయంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి సహకరించారు. ప్రవాసాంధ్రులు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి హర్షం తెలిపారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీనివాసరావు భీమినేని, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు పాల్గొన్నారు. న్యూజెర్సీ నాట్స్ బృందాన్ని చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.

Tags-NATS New Jersey Adopt A Highway Helps Kids Future

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles