టెన్నిస్సీ అగ్నిమాపక శాఖకు ఆటా విరాళం

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ATA) టెన్నిస్సీ రాష్ట్రంలోని ఆరింగ్టన్ నగర అగ్నిమాపక శాఖకు ₹6లక్షల40వేలు ($8000) విరాళంగా అందజేసింది. సమాజహిత కార్యక్రమాలకు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేసే ఆటా లక్ష్యంలో భాగంగా ఈ నిధులను అందజేసినట్టు అధ్యక్షుడు చల్లా జయంత్ తెలిపారు.

నాష్‌విల్ ఆటా ప్రతినిధులు గూడూరు కిషోర్, ఆళ్ల రామకృష్ణరెడ్డి, నూకల నరేందర్, సుశీల్ చందా, నూకల వంశీ, రాచకొండ శాయిరాం, చందా ఇషాన్‌లు నిధుల సమీకరణను సమన్వయపరిచారు. కార్యక్రమంలో తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, బోదిరెడ్డి అనీల్, శ్రీరామ శ్రీనివాస్, గండ్ర రమణ తదితరులు పాల్గొన్నారు. ఆరింగ్టన్ నగర అగ్నిమాపక శాఖ అధికారులు ఆటా విరాళానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags-ATA Tennessee Donates To Arrington Fire Department

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles