వైభవంగా తాల్ 2025 బాలల సంబరాలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో బాలల సంబరాలను లండన్ బరో ఆఫ్ హౌన్స్‌లోలోని ఫెల్థామ్ అసెంబ్లీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. TAL కల్చర్ సెంటర్(TCC) విద్యార్థులతో పాటు బాలబాలికలు..క్లాసికల్ సంగీతం, సాంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలతో అలరించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తెలుగు వక్తృత్వ పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు భాషను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలను మాతృభాషాభిమానులు అభినందించారు.

కౌన్సిలర్ ఏమీ క్రాఫ్ట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. భవిష్యత్ తరాల కోసం తాల్ చేస్తున్న కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తున్నాయని, సంస్కృతిని పోషించే ఇలాంటి కార్యక్రమాలు లండన్ నగరానికి ఆయువుపట్టు అని ఆమె పేర్కొన్నారు.

కల్చర్ ట్రస్టీ శ్రీదేవి అలెడ్డుల, వెంకట్ తోటకుర, TCC ట్రస్టీ అశోక్ మడిశెట్టి, చైర్మన్ రవి సబ్బా, ట్రస్టీలు అనిల్ ఆనంతుల, కీరన్ కప్పేటా, వెంకట్ నీల, రవి మోచెర్ల, సత్య పెదిరెడ్డి తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేశారు.

Tags-London Telugu NRI NRT News - TAL 2025 Childrens Day

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles