మురికివాడ నిరుపేదలకు నాట్స్ అన్నదానం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) హైదరాబాద్‌లో సర్వ్ నీడి సంస్థతో కలిసి మడ్‌ఫోర్డ్ మురికివాడ ప్రాంతంలో నిరుపేద బాలలకు అన్నదానం చేసింది. కేక్ కట్ చేసి చిన్నారుల్లో సంతోషాన్ని నింపింది. పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందించారు.

చిన్నారుల్లో కనిపించిన ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేనని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. సర్వ్ నీడి ద్వారా గౌతమ్ నిరుపేద బాలల కోసం చేస్తున్న సేవలను ప్రశాంత్ ప్రశంసించారు. సర్వ్ నీడ్‌తో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తాము సిద్ధంంగా ఉన్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. భారతదేశంలో ప్రత్యేక సందర్భాలలో భోజనం దానం చేయాలనుకునే ప్రవాస భారతీయులకు 'సర్వ్ నీడి' సంస్థ మంచి వేదికగా నిలుస్తోందని నాట్స్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కిరణ్ మందాడి అన్నారు.

Tags-NATS Serves The Needy People In Hyderabad Slums With Help From NGO

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles