దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి

Featured Image

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి.ఆర్.నాయుడు వెల్లడించారు. చైర్మన్ బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను తితిదే పాలకమండలి సభ్యుడు నన్నపనేని సదాశివరావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, . రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు.

ఇందులో రోగుల సహాయకులకు ఉచితభోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా ఈ రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ చైర్మన్ కి వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు చెప్పారు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags-TTD SWIMS To Be Developed Extensively Says BR Naidu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles