నందిని అబ్బగౌనికి నారీ శక్తి పురస్కారం

Featured Image

ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం ఇండియన్ కల్చరల్ సెంటర్(ICC) సహకారంతో శుక్రవారం నాడు ప్రవాసీ భారతీయ దివస్‌ను దోహాలోని ఐసీసీ అశోకా హాల్‌లో నిర్వహించింది. ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయుల సేవలను గుర్తిస్తూ జరుపుకుంటారు. ఈ ఏడాది వేడుకల్లో నారి శక్తి – మహిళల శక్తి అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. భారతీయ సమాజానికి సేవలందిస్తున్న మహిళా నాయకులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారి శక్తి సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ పురస్కారం నాయకత్వం, సేవాభావం, సమాజ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తుంది. ఈ సందర్భంగా ప్రవాస తెలంగాణ మహిళ నందిని అబ్బగౌనికి నారి శక్తి సమ్మాన్ పురస్కారం అందజేశారు. ఖతార్‌లో భారతీయ సమాజానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు ఈ గౌరవం లభించింది.

Tags-Qatar NRT Nandini Abbagouni Felicitated With Naari Samman Award

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles