సెయింట్ లూయిస్‌లో నాట్స్ రక్తదాన శిబిరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మిస్సోరిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో జరిగిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం అనంతరం డాక్టర్ ఏజేతో కలిసి వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపరలు రక్తదానం చేశారు. నాగ శ్రీనివాస్ శిస్ట్లా, నవీన్ కొమ్మినేని, మధుసూదన్ దడ్డాల తదితరులు సేవలు అందించారు. నాట్స్ మిస్సోరి విభాగాన్ని చైర్మన్ కిషోర్ కంచెర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-NATS St Louis Conducts Blood Donation Drive And Free Medical Camp

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles