లండన్ కువైట్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

Featured Image

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద నుండి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపడం సంతషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని ,ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చెయ్యాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదానం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలిగి మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ అందించిన నాయకత్వం చారిత్రాత్మకమని కొనియాడారు. త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూడాలని, రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని అధ్యక్షురాలు అభిలాష తెలిపారు.

Tags-KCRs 72nd Birthday Celebrated In London And Kuwait

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles