చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో పల్లె సంబరాలు
చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో పల్లె సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముచ్చటైన అలంకరణలు, చిన్నారుల నాట్యాలు, ఆడపడుచుల ఆటపాటలు, వినోదాత్మకమైన నాటికలు, ఉద్వేగభరితమైన దేశభక్తి గీతాలు, రుచికరమైన వంటలతో సంబరం ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడ, చైర్మన్ రాఘవ జాట్లలు స్వాగతోపన్యాసం చేశారు. కార్యవర్గాన్ని పరిచయం చేశారు. మాజీ అధ్యక్షుడు మతుకుమిల్లి శ్రీకృష్ణ సేవలను కొనియాడారు. ఉపాధ్యక్షుడు రామకృష్ణ తాడేపల్లి, మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, శ్రీనివాస్ సుబుద్ది, ప్రభాకర్ మల్లంపల్లి, సుగుణ రామదాసు, సంస్థ ట్రస్టీలు సుజాత, పద్మారావు అప్పలనేని, ఉమా కటికి, భార్గవి-ప్రసాద్ నెట్టెం, పవిత్ర-దినకర్ కరుమూరి, రాఘవ-శివబాల జాట్ల కార్యక్రమ నిర్వహణకు సహకారం అందించారు.
శైలజ సప్ప ఆధ్వర్యంలోని సాంస్కృతిక విభాగం, స్వర్ణ నీలపు, రమ్య మైనేని సహకారంతో విలక్షణమైన సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి పల్లె సంబరాలకు వచ్చిన ఆహ్వానితులను అలరించారు. యశోద వెదుల, గౌరీ అద్దంకి, డాక్టర్ సుందరవల్లి వ్యాఖ్యాతలుగా రక్తి కట్టించారు. 30 మందికి పైగా కళాకారులు దేశభక్తి గీతాలతో చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పద్మజ, నరసింహరెడ్డి ఒగ్గు రచన, దర్శకత్వంలో రూపొందించిన యముగోల దృశ్యరూపకం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అతిథులకు సాంప్రదాయ పద్ధతిలో నేతి అరిసెలు వడ్డించారు.
చికాగో ఆంధ్ర ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను సునీత రాచపల్లి వివరించారు. చైతన్య ఈదర, సురేష్ గ్రంధి, స్రవంతి గ్రంధి, సాహితీ ఆదిమూలం, శైలేష్ మద్ది, శ్రీని పద్యాల, సురేష్ కుమార్ అయినపూడి, ప్రవీణ్ వేములపల్లి, ప్రియా మతుకుమల్లి, హరిణి మేడ, శృతి కూచంపూడి, శ్వేత కొత్తపల్లి, మోహిని చేపలమడుగు, ప్రశాంతి తాడేపల్లి, స్వప్న మహాళి, రమ్య కొత్తమాసు, స్మిత నండూరి, సరిత ఆయనపూడి, సుప్రియ మద్ది, ధర్మేంద్ర గాలి, సురేష్ మహాళి, మురళి రెడ్డివారి, కిరణ్ వంకాయలపాటి, శ్రీస్మిత నండూరి, శ్రీయ కొంచాడ, దివిజ చల్లా, జైఆనికేత్ మేడబోయిన, జిష్ణు వీరపనేని, రామారావు కొత్తమాసులు వేడుక నిర్వహణకు తోడ్పడ్డారు. సంస్థ కార్యదర్శి నరసింహరెడ్డి వందన సమర్పణ చేశారు.
Tags-Palle Sambaralu In Chicago By Chicago Andhra Association
Gallery








Latest Articles
- Nats Phildalephia Celebrates Childrens Festival 2026
- 2026 Tantex Sankranti Celebrated In Telugu Spirit
- Siddhipeta Nri Uday Nagaraju Takes Oath In Uk House Of Lords From Bloomsbery
- Sreekanth Akkapalli Takes Charge As Fia President
- Charlotte Nats Conducts 2026 Chess Tournament
- 2026 Ata 19Th Conference Kick Off In Virginia
- Tana New York Conducts Cpr Training Session
- Telugu Samithi Of Nebraska Sankranti 2026
- Tantex 2026 Sankranti In Frisco
- Myta Malaysia Performs For Indian Pm Modi
- Tagkc Kansas City Telugus Celebrate 2026 Sankranthi
- Apts Helps Build Andhras First Co Working Space And Digital Library In Kuppam
- Siliconandhra Silver Jubilee On August 8Th 2026
- Bavaria Indians Celebrate Festival Of Togetherness 2026
- Gta Announces 2026 27 Ec And Bot
- Tagb Boston 2025 26 Transfers Power To New Ec
- Ata Pennsylvania Delaware Teams Meet To Discuss Ata 2026 Conference Arrangement
- Mega Kamma Mahanadu In Tamil Nadu By Kgf On February 8Th
- Chetana Foundation Charity Events In Kalwakurthy
- Doha Music Lovers Singing And Dance Competition Across India