రసమాధుర్యంగా సాగిన టాంటెక్స్ 223వ సాహితీ సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక నెల నెలా తెలుగువెన్నెలలో భాగంగా 223వ సాహిత్య సదస్సు ఆదివారం నాడు డాలస్‌లో రసకందాయకంగా సాగింది. 'పద్యంతో నా ప్రయాణం' అనే అంశంపై ముఖ్య అతిథి త్యాగరాజు ఎల్లంరాజు ప్రసంగం సాహితీ ప్రియులను అలరించింది. సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడా ప్రసంగిస్తూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని పేర్కొన్నారు.
త్యాగరాజు తన ప్రసంగంలో నరసరావుపేటలో గణితం-సైన్స్ టీచరుగా పనిచేసి 2020లో పదవీ విరమణ చేసినప్పటికీ భాషలు, కళల పట్ల మక్కువతో సాంఘిక నాటికలు, నాటకాలు, పౌరాణికాలు, ఏకపాత్రాభినయం, బుర్రకథ, హరికథ వంటి రంగాల్లో కృషి చేశానని తెలిపారు. అజంత భాష తెలుగుకే పరిమితమయిన పద్యం, అవధాన ప్రక్రియలు మాధుర్య గాంభీర్యములతో తరాలుగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సంగీతం ప్రత్యేకంగా నేర్చుకోనప్పటికీ అనుభవం రీత్యా రాగ స్వభావ జ్ఞానం, స్వరపరచి ఆలపించే అనుభవం ప్రాప్తించాయన్నారు. ఈ అనుభవంలో భాగంగా కరుణశ్రీ తపోభంగము, బాపూజీ భరతధీర శతకంలోని కొన్ని పద్యాలకి తను కట్టిన బాణీలో మధ్యమావతి, బృందావన సారంగ రాగాల్లో పాడి అలరించారు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను ఆభేరి, రేవతి, పీలు, సింధుబైరవి రాగాల్లో తను కట్టిన బాణిల్లో రాగయుక్తంగా పాడి రక్తికట్టించారు.
కాశీనాథుని రాధ ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను, లెనిన్ వేముల నన్నెచోడుని కుమారసంభవములో రాసిన చతుర్విద గర్భ కంద పద్యాన్ని ఆల్పించగా, డాక్టర్ యు.నరసింహారెడ్డి 'మన తెలుగు సిరి సంపదలు'తో అలరించారు. అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తరపున దయాకర్ త్యాగరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, ఆనంద మూర్తి కూచిభొట్ల, లలితా మూర్తి కూచిభొట్ల, కార్యవర్గ సభ్యులు సునీల్ సూరపరాజు, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.
Tags-TANTEX 223rd NNTV Literary Meet Graced By Yellamraju Tyagaraju రసమాధుర్యంగా సాగిన టాంటెక్స్ 223వ సాహితీ సదస్సు #TANTEX #UttaraTexasTeluguSangham #TeluguLiterature #TeluguSahityam #SahitiSadasu #DallasTelugu #TeluguCommunityUSA #NRIEvents #TeluguVennela #PoetryJourney #Padyam #Avadhanam #TeluguCulture #TyagarajuEllamraju #LiteraryMeet #IndianCommunityUSA #NorthTexasEvents #తెలుగు #టాంటెక్స్ #తెలుగుసాహిత్యం #సాహితీసదస్సు #డాలస్ #తెలుగువెన్నెల #పద్యంతోనాప్రయాణం #అవధానం #తెలుగుసంస్కృతి #ఎన్ఆర్ఐతెలుగు #సాహిత్యవేదిక #త్యాగరాజుఎల్లంరాజు
Gallery


Latest Articles
- Carefully Curated Char Dham Yatra 2026 Focusing On Nris
- Medical School Opportunities For Nri Kids Of H1B Parents In Usa And Canada By Smu Curacao
- Nri Brs Malaysia Celebrates Kcr Birthday
- Ata Team Attends Indian Republic Day Celebration In Virginia
- Kcr Birthday In Bahrain By Nri Brs
- Telugu Assoc Of London Tal Conducts 14Th Annual Volleyball Tournament
- Siva Temple Tour Conducted By Tcss Singapore
- Kcrs 72Nd Birthday Celebrated In London And Kuwait
- Nrts Help Siva Devotees Via Upputuri Chinaramulu Trust
- Ncaia Dc 77Th Indian Republic Day Celebrations Today
- Annamayya District Woman Dies In Malaysia
- Palle Sambaralu In Chicago By Chicago Andhra Association
- Nats Phildalephia Celebrates Childrens Festival 2026
- 2026 Tantex Sankranti Celebrated In Telugu Spirit
- Siddhipeta Nri Uday Nagaraju Takes Oath In Uk House Of Lords From Bloomsbery
- Sreekanth Akkapalli Takes Charge As Fia President
- Charlotte Nats Conducts 2026 Chess Tournament
- 2026 Ata 19Th Conference Kick Off In Virginia
- Tana New York Conducts Cpr Training Session
- Telugu Samithi Of Nebraska Sankranti 2026